జాతీయ క్రీడా ఛాంపియన్‌షిప్‌లో గీతాంజలి విద్యార్థుల సత్తా

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆల్ ఇండియా స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో గీతాంజలి ది గ్లోబల్ స్కూల్, కొండాపూర్ విద్యార్థులు ప్రతిభ చాటారు. YSDA ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో తెలంగాణ జట్లు ఖో ఖో, క్రికెట్‌లో ప్రథమ స్థానాలు, బ్యాడ్మింటన్‌లో ద్వితీయ స్థానాన్ని సాధించాయి. ఈ పోటీల్లో గీతాంజలి ది గ్లోబల్ స్కూల్‌కు చెందిన జగదీశ్వర్, హేమంత్, జతిన్, రిత్విక్, శౌర్య, సాత్విక్, అనిరుధ్, రుషికేష్, అక్షర, అరుషి, యోకల్య తెలంగాణ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. జాతీయ స్థాయి వేదికపై అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించి రాష్ట్రానికి, పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు.

విద్యార్థుల విజయాల్లో కోచ్‌లు మురళి, శ్రీనివాస్ అందించిన శిక్షణ, మార్గదర్శకత్వం కీలకంగా నిలిచాయి. విద్యార్థులకు నిరంతరం శిక్షణ అందిస్తూ వారి క్రీడా ప్రతిభను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన కోచ్‌ల కృషిని పాఠశాల యాజమాన్యం అభినందించింది. 2026లో జాతీయ స్థాయిలో విద్యార్థులు సాధించిన ఈ విజయాలు గీతాంజలి ది గ్లోబల్ స్కూల్ క్రీడా ప్రస్థానంలో మరో మైలురాయిగా నిలిచాయి. విజేత విద్యార్థులు, కోచ్‌లను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. భవిష్యత్తులోనూ మరిన్ని జాతీయ, అంతర్జాతీయ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here