శేరిలింగంపల్లి, అక్టోబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మబూబ్‌పేట్ విలేజ్‌లో ఉన్న హిందూ శ్మశానవాటికలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ స్థానికులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్మశానవాటికలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని స్థానికులతో కలిసి పరిశీలించిన శ్రీకాంత్.. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్ సదుపాయం, అంతర్గత రహదారులు తదితర అంశాలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

శ్మశానవాటికల అభివృద్ధి కూడా ప్రజా అవసరాల్లో ముఖ్యమైన భాగమని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. స్థానికులు తెలిపిన సూచనలు, సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో మిగిలిన అభివృద్ధి పనులను కూడా పూర్తి చేసేలా కృషి చేస్తామని ఉప్పలపాటి శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రమేష్, నవీన్, దయానంద్ ముదిరాజ్, శ్రీనివాస్, సుధాకర్, జె. రమేష్, జె. రాము, జె. సంతోష్, సురేష్, వేణు జీవన్, గంగారం, మల్లేష్, ప్రశాంత్, జై పవన్, నరేందర్, ఎస్. రవీందర్ తదితరులు పాల్గొన్నారు.





