తెరాస‌లో ప్ర‌తి ఒక్క‌రికీ త‌గిన గుర్తింపు

  • భారతీ న‌గ‌ర్ తెరాస రెబ‌ల్ అభ్య‌ర్థి లతా మోహన్ గౌడ్ కు మంత్రి హ‌రీష్ రావు స‌ముదాయింపు
  • నామినేష‌న్ విత్ డ్రాకు అంగీకారం
  • సింధు ఆదర్శ్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తాన‌ని వెల్ల‌డి

భార‌తీన‌గ‌ర్‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): టీఆర్ఎస్ పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్త, నాయకునికి సముచిత న్యాయం లభిస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు భరోసా కల్పించారు. భారతి నగర్ 111 డివిజన్ పరిధిలో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు నామినేషన్ దాఖలు చేసిన జీ లతా మోహన్ గౌడ్ తో మంత్రి ఫోన్లో మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా న్యాయం చేసి తగిన పదవిని కట్ట బెడతానని హామీ ఇచ్చారు. వీరితో పాటు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డిలు లతా మోహన్ గౌడ్ ఇంటికి వచ్చి సముదాయించారు. తామంతా సీఎం కెసిఆర్ ను కలిసి లతా మోహన్ గౌడ్ నాయకత్వానికి తగిన విధంగా ప్రభుత్వ పరమైన నామినేటెడ్ పదవిని ఇప్పించి గౌరవిస్తామని హామీ ఇచ్చారు. అందుకు లతా మోహన్ గౌడ్ నామినేషన్ ను విత్ డ్రా చేసుకొని పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా లతా మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. తాను వేసిన నామినేష‌న్‌ను విత్ డ్రా చేసుకుంటాన‌ని, 111 డివిజన్ పరిధిలో టిఆర్ఎస్ అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డి గెలుపు కోసం శాయ శక్తులా కృషి చేస్తానని తెలిపారు. టిఆర్ఎస్ పార్టీకి తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదని పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటానని అన్నారు. ఈ ఎన్నికలతో పాటు రానున్న జనరల్ ఎలక్షన్ ల‌లో సైతం పార్టీ గెలుపుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

భార‌తి న‌గ‌ర్ తెరాస రెబ‌ల్ అభ్య‌ర్థి లతా మోహన్ గౌడ్ తో చర్చిస్తున్న ఎంపీలు కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆరెక‌పూడి గాంధీ, గూడెం మ‌హిపాల్ రెడ్డి, క్రాంతి కిర‌ణ్
స‌మావేశం అనంత‌రం లతా మోహన్ గౌడ్ తో ఎంపీలు కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆరెక‌పూడి గాంధీ, గూడెం మ‌హిపాల్ రెడ్డి, క్రాంతి కిర‌ణ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here