శేరిలింగంపల్లి, డిసెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): కీలకమైన రహదారిలో ట్రాఫిక్కు అంతరాయం కలిగించేలా పాదచారులకు అసౌకర్యం కలిగించేలా ఫుట్ పాత్లపై ఏర్పాటు చేసిన ఆక్రమణలను శేరిలింగంపల్లి పట్టణ ప్రణాళిక అధికారులు తొలగించారు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు హెచ్సీయూ డిపో నుంచి గుల్మోహర్ కూడలి వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర ఫుట్ పాత్లపై ఉన్న 40కి పైగా చిరు వ్యాపారాలను అధికారులు తొలగించారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే సహించ బోమని అధికారులు స్పష్టం చేశారు. ఇకపై ప్రతి శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఫుట్పాత్ ఆక్రమణలను తొలగిస్తామని శేరిలింగంపల్లి పట్టణ ప్రణాళిక విభాగం ఏసీపీ వెంకటరమణ, టీపీఎస్ రవీందర్, జిషాన్ తెలిపారు.