శేరిలింగంపల్లి, నవంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): రాయదుర్గం యాదవ్ సంఘం ఆధ్వర్యంలో 59వ సదర్ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాయదుర్గం యాదవ్ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు పల కృష్ణ యాదవ్ సమక్షంలో నిర్వహించిన ఈ వేడుకలకు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే వి.జగదీశ్వర్ గౌడ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి యాదవులకు అందాల్సిన అన్ని ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గోకుల్ యువసేన సభ్యులు, యువజన విభాగం అధ్యక్షుడు నాగపురి అశోక్ యాదవ్, అల్లాడి యాదయ్య యాదవ్, నాగపురి శ్యామ్ యాదవ్, కంటెస్టెడ్ కార్పొరేటర్ మైపాల్ యాదవ్, గంగాల గణేష్ యాదవ్, జనార్దన్ యాదవ్, అప్పల రమేష్ యాదవ్, దవనబోయిన కబీర్దాస్ యాదవ్, శూలం నిఖిల్ యాదవ్, చెన్నబోయిన అమర్నాథ్ యాదవ్, అల్లాడి అఖిలేష్ యాదవ్, అల్లాడి అభిషేక్ యాదవ్, శేరిలింగంపల్లి సెంట్రల్ యూనివర్సిటీ బిసి మహిళా మోర్చా అధ్యక్షురాలు వసుమతి యాదవ్, బీసీ సంఘం యువజన నాయకుడు శివ కుమార్ యాదవ్, సంగారెడ్డి జిల్లా విద్యావంతుల వేదిక ఉపాధ్యక్షుడు గోకుల్ శివకుమార్ యాదవ్, బీసీ నాయకులు పాములేటి యాదవ్, భేరి చంద్రశేఖర్ యాదవ్, నవీన్ యాదవ్, వంశీ యాదవ్, మిద్దెల తేజ యాదవ్, కుమ్మెర శివకుమార్ యాదవ్, పరిసర ప్రాంతాల యాదవ సంఘం పెద్దలు, యువజన నాయకులు పెద్ద ఎత్తున సదర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.