నిరుపేదలకు ఆర్థిక భరోసా సీఎంఆర్ఎఫ్ : ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం కి చెందిన బేబి ఆఫ్ ఆనమ్ ఫాతిమా అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ నుంచి రూ. 75 వేలు మంజూరయ్యాయి.

ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ మంజూరి పత్రాన్ని బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు, అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా వైద్య చికిత్సకి సహకారం అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here