నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధి గోపనపల్లి తండాలోని పెద్ద చెరువులో ఆక్సిజన్ అందక చేపలు చనిపోయాయని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై పెద్ద చెరువు సందర్శించి మాట్లాడారు.
గ్రామం నుంచి వెలువడే కలుషిత నీరు నేరుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ద్వారా చెరువులోకి విడిచారని, దీంతో చేపలు మృతి చెందాయని భావిస్తున్నట్లు తెలిపారు.
కలుషిత నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. మత్స్యకారులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రంగస్వామి, నగేష్, విక్రమ్, రంగస్వామి, రంగస్వామి, వీరాస్వామి పాల్గొన్నారు.