నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ జెరిపేటి జైపాల్ ను బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీకాంత్ గౌడ్ శనివారం మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. శేరిలింగంపల్లి హైటెక్ నియోజకవర్గం నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకులు జెరిపేటి జైపాల్ కు కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించడం అభినందనీయమని అన్నారు. అర్హులైన వారిని అందలం ఎక్కిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలోని అంత్యంత వెనుకబడిన వర్గాల వారికి జైపాల్ హయాంలో ఖచ్చితంగా మేలు జరుగుతుందని ఆశాబావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి వంశీకృష్ణ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాటా నర్సింహా గౌడ్, దర్గా పాండు పహిల్వాన్ తదితరులు పాల్గొన్నారు.