కార్పొరేట‌ర్‌గా పోటీ చేసేందుకు అవ‌కాశం క‌ల్పించండి

  • ప్రభుత్వ విప్ గాంధీకి మాజీ కౌన్సిలర్ సునీత ప్రభాకర్ రెడ్డి వినతి 

చందాన‌గ‌ర్‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రానున్న జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో చందాన‌గ‌ర్ డివిజ‌న్‌లో తెరాస త‌ర‌ఫున కార్పొరేట‌ర్ అభ్య‌ర్థిగా పోటీ చేసేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరుతూ మాజీ కౌన్సిలర్ సునీత ప్ర‌భాక‌ర్ రెడ్డి గురువారం ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీకి బ‌యోడేటాను అందజేశారు. గతంలో కార్పొరేటర్ గా పనిచేసిన అనుభవం, డివిజన్ లోని అన్ని ప్రాంతాల ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయని, తనకు అవకాశం కల్పిస్తే భారీ మెజారిటీతో గెలిచి వస్తానని, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి టిఆర్ఎస్ పార్టీని బలపరుస్తామని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డివిజ‌న్ తెరాస అధ్య‌క్షుడు రెడ్డి ర‌ఘునాథ్ రెడ్డి, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్, నాయ‌కులు ఉరిటి వెంక‌ట్ రావు, దాసరి గోపి కృష్ణ, రాజు, జ‌నార్ద‌న్ రెడ్డి, ప్ర‌వీణ్‌, వ‌ర ప్ర‌సాద్‌, శేఖ‌ర్‌, ప్ర‌వీణ్ రెడ్డి, మ‌ల్లేష్‌, భాగ్య పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీకి విన‌తిప‌త్రం అంద‌జేస్తున్న సునీత ప్ర‌భాక‌ర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here