– ప్రభుత్వవిప్ గాంధీ, ఎంపీ రంజిత్ రెడ్డిలకు ఆలయ పాలకమండలి అధ్యక్షుడు రఘుపతి రెడ్డి ఆహ్వానం
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ లోని విశాఖ శ్రీ శారద పీఠపాలిత శ్రీ వేంకటేశ్వర ఆలయ సముదాయంలో నవంబర్ 7 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కాగా ఆనవాయితీగా జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందాలంటూ ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డిలకు ఆలయ పాలకమండలి అధ్యక్షులు కట్ల రఘుపతి రెడ్డి శుక్రవారం ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వరహాలు రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, దాసరి గోపి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.