- ప్రజా ఆశీర్వాద యాత్రలో మొవ్వ సత్య నారాయణ
నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ 108వ డివిజన్ బి.కె ఎంక్లేవ్ వద్ద భారతీయ జనతా పార్టీ ప్రజా ఆశీర్వాద యాత్ర కొనసాగింది. మొవ్వా సత్యనారాయణ గారు , కొరడాల నరేష్ గారు , ప్రభాకర్ యాదవ్ గార్ల ఆధ్వర్యంలో ప్రారంభించి న యాత్ర ప్రజయ్ షెల్టర్స్, రెడ్డి కాలనీ మీదుగా వెళ్ళింది. ఇందులో భాగంగా ఇంటింటికి తిరిగుతూ, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్బంగా తమకు త్రాగు నీటి సౌకర్యం లేదని , పెన్షన్స్ రావడం లేదని, రోడ్లు, మురుగు, కుక్కలు, దోమల బెడద సమస్యలపై స్థానికులు వారికి వివరించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు,కార్యకర్తలు పార్టీ అభిమానులు పాల్గొన్నారు.