- న్యాయం చేయాలంటూ బండి అనురాధ ఫిర్యాదు
శేరిలింగంపల్లి: మియాపూర్ వద్ద చిన్నపాటి టీ స్టాల్ నడుపుకుంటున్న తనను లంచం ఇవ్వనందుకు తీవ్ర పదజాలంతో దూషిస్తున్నాడని, ఖాళీచేయాలంటూ ఒత్తిడి తెస్తున్నాడని ఓ మహిళ (బండి అనురాధ) ఆవేదన వ్యక్తం చేసింది. 10 రోజులుగా ఇబ్బందులు పెడుతున్నాడని, జిహెచ్ ఎంసి అనుమతి పత్రాలు చూపించిన జెసిబి తో తొలగిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని, 15 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నానని, మరో జీవనోపాధి లేదని చెప్పుకుంటే, అమరాద్యగా మాట్లాడుతున్నాడని కమీషనర్ కు రాసిన ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నది.
దీనిని రామోస్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ నుండి తీవ్రంగా ఖండిస్తున్నానని, ఇలాంటి వారిని విధుల నుండి తొలగించి న్యాయం చేయాలని కోరుతున్నట్లు వేడుకున్నది.