నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణా విమోచన దినోత్సవ కార్యక్రమం గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గంలో ఘనంగా జరిగింది. బిజెపి డివిజన్ ప్రెసిడెంట్ కృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి రంగారెడి అర్భన్ జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రధానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చొరవ చూపితే గాని స్థానిక ప్రభుత్వాలకు ఉత్సవాలు జరుపుకునేందుకు సోయి రాలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రమేష్ సోమి శెట్టి,రవీందర్ రెడ్డి, నరేందర్ గౌడ్, నీరుడి సురేష్ ముదిరాజ్, నరేందర్ ముదిరాజ్, డివిజన్ నాయకులు శ్రీనివాస్ చారి, సురేందర్, అశోక్ ముదిరాజ్,సతీష్ గౌడ్, దయాకర్, D.నరేందర్ యాదవ్ N.శ్యామ్ యాదవ్, సంజీవ, నర్సింహారాజు, మల్లేష్, ఓంజీ పాల్గొన్నారు.