నమస్తే శేరిలింగంపల్లి: సాప్ట్ వేర్ మహిళా ఉద్యోగి అపార్ట్ మెంట్ లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మూకాశ్మీర్ కు చెందిన కృతి సంబ్యాల్ (27) గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్ వెర్ కంపెనీ లో పనిచేస్తోంది. గచ్చిబౌలి నానకరంగుడా లోని ఓ అపార్ట్మెంట్ లో ఇద్దరి రూమ్ మేట్స్ తో కలిసి ఉంటూ వర్క్ ఫ్రం హోమ్ విధులు నిర్వహిస్తుంది.
తన అపార్ట్ మెంట్ లో ఉండే ఇద్దరు రూమ్ మేట్స్ రూమ్ లో లేని సమయంలో ఒంటరిగా ఉన్న కృతి సంబ్యాల్ తన స్నేహితుడైన సచిన్ కు వాట్సప్ మెసేజ్ ద్వారా ఆత్మహత్య చేసుకుంటున్నానని సమాచారం పంపించింది. సచిన్ హుటాహుటిన వచ్చి చూడగా అపార్ట్ మెంట్ డోర్ వేసి ఉండడంతో మరో రూం మెట్ వద్ద తాళాలు తీసుకుని డోర్ తీసి లోపలకు వెళ్లారు. లోపలకు వెళ్లి చూసే సరికి కృతి సబ్యాల్ సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. హుటాహుటిన హాస్పిటల్ కు తరలించగా అప్పటికే కృతి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కృతి ఆత్మహత్యకు కుటుంబ కలహాలు గాని, ఆర్థిక ఇబ్బందులు గాని ఇవేమి లేవని, ఆత్మహత్యకు గల కారణాలపై వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.