నమస్తే శేరిలింగంపల్లి: తమ కాలనీలో నెలకొన్న భూగర్భ డ్రైనేజీ సమస్యను పరిష్కరించేలా చూడాలని గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కి ఎన్టీఆర్ నగర్ వాసులు వినతి పత్రం అందజేశారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని కార్పొరేటర్ కార్యాలయంలో కలిశారు. తమ కాలనీలో నెలకొన్న భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఎన్టీఆర్ కాలనీలో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు వేగంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగ సుబ్రహ్మణ్యం, రవి, శ్రీనివాస్ రావు, రాంచందర్, ఏడుకొండలు, పద్మావతి, కేవి రావు, నాగేంద్ర, నాగరాజు, లక్ష్మి, శ్రీశైలం, రమణ, ఎన్టీఆర్ నగర్, సోఫా కాలనీ, తాజ్ నగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
