నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ లోని మక్తా మహబూబ్ పెట్ లో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో నవరాత్రులు పూజలందుకున్న వినాయకుని నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజింపబడిన విఘ్నేశ్వరుని లడ్డును రూ.3 లక్షల ఒక్క రూపాయికి వేలం పాట ద్వారా హనుమాన్ యూత్ సభ్యులు దక్కించుకున్నారు. ఆ భగవంతుని ఆశీస్సులు అందరి పై ఉండాలని ఈ సందర్భంగా యూత్ సభ్యులు కోరుకున్నారు.