నమస్తే శేరిలింగంపల్లి: సహాయ ఫౌండేషన్, బీహెచ్ఈఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్స్ మాక్స్విజన్ ఐకేర్ సహకారంతో సోమవారం బీహెచ్ఈఎల్ ఎంఐజీ సొసైటీ కార్యాలయంలో ఉచిత ఆరోగ్య వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చలనచిత్ర సీనియర్ నటీమణి షానూర్ సన, టీవీ ప్రముఖులు రవికిరణ్, సుష్మా కిరోన్ ముఖ్య అతిథులుగా హాజరై ఆరోగ్య వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో 250 మంది వైద్య పరీక్షలు నిర్వహించుకున్నట్లు సహాయ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి, బీహెచ్ఈఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్ పూర్వ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు గొర్తి శ్రీనివాస్ తెలిపారు. వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ నరేందర్, సూర్యారావు, విమల్ కుమార్, విశాలి, వసుంధర, శ్రీనివాసన్, శేషగిరి తదితరులు పాల్గొన్నారు.