ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ల‌క్ష్యం: కార్పొటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

ఆల్విన్ కాల‌నీ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ డివిజన్ లో శాసనసభ్యుడు ఆరెక‌పూడి గాంధీ పిలుపు మేరకు అభివృద్ధే లక్ష్యంగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు వెళ్తున్నామే తప్ప ఎవరినీ ఇబ్బంది పెట్టడం త‌మ‌‌ ఉద్దేశ్యం కాదని డివిజ‌న్ కార్పొటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ ప‌రిధిలోని తులసివనం గృహ సముదాయం సమీపంలో కొన‌సాగుతున్న రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ శుక్ర‌వారం జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు.

తులసివనం గృహ సముదాయం వ‌ద్ద అధికారుల‌తో మాట్లాడుతున్న కార్పొటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

రోడ్డు అభివృద్ధి పనులలో తులసివనం గృహ సముదాయం వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు నిర్మాణం పనులను పూర్తి చేస్తామ‌ని కార్పొరేట‌ర్ తెలిపారు. గృహ సముదాయం గోడకు అవరోధం కలిగించబోమని, దీనికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు డీఈ గోవర్ధన్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ వేణు, డివిజన్ తెరాస అధ్యక్షుడు జిల్లా గణేష్, వార్డు సభ్యుడు కాశీనాథ్ యాదవ్, ఇరిగేషన్ ఏఈ విశ్వం, జీహెచ్ఎంసీ ఏఈ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here