హైదర్‌నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ కు చెందిన నాయకుడు బొల్లేపల్లి సీతారామరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా భిక్షపతియాదవ్ మాట్లాడుతూ ఈ దేశానికి దిక్సూచి మోడీ అని అన్నారు. 2023 లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగుర వేయడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ పాలనకు ప్రజలే చరమగీతం పాడే రోజు దగ్గరలో ఉందని అన్నారు. అనంతరం బొల్లేపల్లి సీతారామరాజు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బిజెపి మరింత బలపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాలయ్య, నివర్తి అంజయ్య, పాండు, తుకారం, మౌలాలి, శీను పాల్గొన్నారు.