నమస్తే శేరిలింగంపల్లి: కరోనా బారిన పడి నలుగురు వ్యక్తుల్ని కోల్పోయిన బిహెచ్ఇఎల్ రాములు కుటుంబానికి భారతీనగర్ డివిజన్ వార్డు సభ్యుడు నవీన్భూన్ ఆర్థిక సహకారాన్ని అందజేశారు. జిఎంఆర్ ఆదర్శ మహిళా మండలి, తన స్నేహితుల సహకారంతో రూ.60 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నవీన్భూన్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి సాయం అందించడం ప్రతిఒక్కరి బాధ్యత అని తెలిపారు. పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, కార్పొరేటర్ సింధుఆదర్శ్రెడ్డిల ఆదర్శంతో తమ వంతు బాధ్యతగా బాధిత కుటుంబానికి సహాయాన్ని అందజేశామని తెలిపారు.