సెన్సియో కేఫ్ & బిస్త్రో షాపును ప్రారంభించిన బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు షేక్ ఆదిల్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజా రాజేశ్వరి కాలనీలో సెన్సియో కేఫ్ & బిస్త్రో షాపును నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ షాప్ కు కొండాపూర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు షేక్ ఆదిల్ పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రముఖ వ్యాపారావేత్త గూడూరి వెంకటరాజు తో కలసి ప్రారంభోత్సవం చేశారు.

సెన్సియో కేఫ్ & బిస్త్రో షాపును ప్రముఖ వ్యాపారావేత్త గూడూరి వెంకటరాజు తో కలసి ప్రారంభిస్తున్న బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు షేక్ ఆదిల్ పటేల్

ఈ సందర్బంగా సెన్సియో కేఫ్ & బిస్త్రో షాపు యాజమాన్యం దాట్ల శ్రీనివాస్ రాజుకి శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ యువ నాయకులు కచ్చవా దీపక్, మిథిలేష్ వర్మ, వేగీరాజు వరహారాజు, దాట్ల బంగారు రాజు, పరిమి రాజేష్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here