మైనార్టీల‌కు అందిస్తున్న ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి: PAC చైర్మన్ ఆరెక‌పూడి గాంధీ

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ మైనారిటీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్ప కానుక ఇచ్చారు అని PAC చైర్మన్ ఆరెక‌పూడి గాంధీ తెలిపారు. తెలంగాణలో మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక అడుగు వేసింది అని అన్నారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన, రేవంత్ అన్నా కా సహారా మిస్కినో కే లియే పేరిట రెండు సరికొత్త పథకాలను ప్రారంభించార‌ని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన పథకం కింద వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు, అవివాహిత మహిళలకు రూ.50,000 ఆర్థిక సహాయం అందించడం జ‌రుగుతుంద‌ని తెలిపారు.

రేవంత్ అన్నా కా సహారా మిస్కినో కే లియే పథకం కింద ఫఖీ ర్, దూదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు అందించబడ‌తాయ‌ని అన్నారు. ఈ రెండు పథకాల కింద ప్రయోజనాలను పొందడానికి TGOBMMS వెబ్ సైట్ tgobmms.cgg.gov.in లో ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రారంభ తేదీ 19.09.2025 అని అన్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ముగింపు తేదీని 06.10.2025 గా నిర్ణ‌యించార‌ని తెలిపారు. ఇందుకు గాను ప‌లు అర్హ‌త ప్ర‌మాణాలు ఉన్నాయ‌ని అన్నారు. దరఖాస్తుదారుడు ఫఖీర్, దూదేకుల, దుర్బల ముస్లిం సమాజానికి చెందినవారు అయి ఉండాల‌ని, చిరునామా రుజువుగా దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, ఆహార భద్రతా కార్డు తప్పనిసరిగా జతపరచాల‌ని, దరఖాస్తుదారుడి వయోపరిమితి 21 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాల‌ని, ఓటరు ఐడి, వయస్సు రుజువుగా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల‌ని అన్నారు.

మోపెడ్‌లు, సైకిళ్ళు, ఇ-సైకిళ్ల రూపంలో ఒకేసారి మంజూరు చేస్తార‌ని, ఒక కుటుంబం, ఇంటి యజమానికి ఇవ్వబడుతుంద‌ని, గత 5 సంవత్సరాలుగా TGMFC నుండి ఆర్థిక సహాయం పొందనందుకు దరఖాస్తుదారుడి స్వీయ ప్రకటన చేయాల్సి ఉంటుంద‌ని, ఎంపిక ప్రక్రియను జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ, జిల్లా స్థాయి స్క్రీనింగ్, ఎంపిక కమిటీ bv నేతృత్వంలోని జిల్లా కలెక్టర్ ప‌ర్య‌వేక్షిస్తార‌ని, సంబంధిత జిల్లాలో నమోదైన సంబంధిత సంఘం ద్వారా వ్యక్తి గుర్తింపు ల‌భిస్తుంద‌ని, ఆర్థిక సహాయం మోపెడ్‌లు, సైకిళ్లు, ఇ-సైకిళ్ల రూపంలో ఒకేసారి గ్రాంట్‌గా విడుదల చేయబడుతుంద‌ని, నకిలీలు లేవని నిర్ధారించుకోవడం DMWOల బాధ్యత అని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here