శేరిలింగంపల్లి, మే 25 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీ బాలాజీ నగర్ గ్రేటర్ ఇన్ఫ్రా అపార్ట్మెంట్స్ లలో నూతనంగా ఏర్పాటు చేసిన విజేత సూపర్ మార్కెట్ స్టోర్ ను మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. బాలాజీ నగర్ గ్రేటర్ ఇన్ఫ్రా అపార్ట్మెంట్స్ లలో విజేత సూపర్ మార్కెట్ 116 వ స్టోర్ ను ప్రారంభించడం జరిగిందని విజేత సూపర్ మార్కెట్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కస్టమర్లకు నమ్మకంగా అనుగుణంగా మంచి సేవలను అందజేస్తూ వ్యాపార రంగంలో ముందుకు వెళ్ళాలని సూచించారు. కస్టమర్ల ఆదరణ అభిమానం పొందిన ప్రతి వ్యాపారస్తుడు అగ్రస్థానంలో వుంటారని శ్రీకాంత్ అన్నారు.
ఈ కార్యక్రమంలో విజేత సూపర్ మార్కెట్ డైరెక్టర్స్ సందీప్, సిద్దు, గ్రేటర్ ఇన్ఫ్రా డైరెక్టర్స్, కెవిపి ప్రసాద్ రావు, రవి, నెహ్రూ, శ్రీనివాస్, స్థానిక నాయకులు వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.