నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్, హఫీజ్ పేట్ డివిజన్ పరిధుల్లో వరద నీటి కాలువ నిర్మాణం పనులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. మాదాపూర్ డివిజన్ లోని ఇజ్జత్ నగర్ లో రూ. కోటి 90 లక్షలు, హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ ఫేజ్- 5 లో 10 A, 10 B బ్లాక్స్ నుండి సితార గ్రాండ్ హోటల్ కల్వర్ట్ వరకు రూ. కోటి 75 లక్షల అంచనా వ్యయంతో వరద నీటి కాలువ నిర్మాణం పనులకు కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా కృషి చేస్తోందన్నారు. మంత్రి కేటీఆర్ సహకారంతో శేరిలింగంపల్లి నియోకజకర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరద నీటి కాలువ పునరుద్దరణ పనులను చేపడుతున్నట్లు చెప్పారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసి అధికారులు ఈఈ శ్రీకాంతిని , డీఈ స్రవంతి, ఏఈలు ప్రశాంత్, ధీరజ్ నాయకులు రాంచందర్, మహేందర్, రవి,ప్రసాద్, మహేందర్, హుస్సేన్, శాంతయ్య, జనార్థన్, తదితరులు పాల్గొన్నారు.