నమస్తే శేరిలింగంపల్లి:టీఆర్ఎస్ ప్రభుత్వం పక్క ప్రణాళికతో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజా సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని గంగారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను బస్తి నాయకులతో కలిసి కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదాపూర్, హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో చాలా చోట్ల నూతనంగా చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను చేపట్టడం జరుగుతుందని అన్నారు. అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేసేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శేఖర్ ముదిరాజ్, రావు కుమార్, హఫీజ్ పేట్ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జ్ఞనేశ్వర్, గంగారాం టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు రోహిత్ ముదిరాజ్,ఎస్సీ సెల్ అధ్యక్షుడు అనిల్ కుమార్, మహిళా కమిటీ అధ్యక్షురాలు భీమమ్మ, నాయకులు సత్యం, నాని, పెంటయ్య, తదితరులు పాల్గొన్నారు.