హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు టీపీయూఎస్ డైరీని టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి తిరుపతి రెడ్డికి, టిఆర్ఎస్ పార్టీ హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపీయూఎస్ స్టేట్ జాయింట్ సెక్రెటరీ ఆశిల శివ కుమార్, రాష్ట్ర కార్యదర్శి జీవానంద, సోషల్ మీడియా ఇంచార్జ్ మోహన్ నాయక్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, వార్డ్ మెంబర్ వెంకటేష్ గౌడ్, మల్లేష్ గౌడ్, సంజీవ్ గౌడ్, టీపీయూఎస్ శేరిలింగంపల్లి కార్యదర్శి నర్సింగ్ రావు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సతీష్ కుమార్, లక్కీ దాస్ పాల్గొన్నారు.