శేరిలింగంపల్లి, నవంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్‌పల్లి డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్ కాలనీకి చెందిన వినోద్ కుమార్ వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా CMRF ద్వారా మంజూరైన రూ.60,000 ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కును బాధిత కుటుంబానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, తిరుపతి రావు, విజయ్ కుమార్, ప్రేమ్ కుమార్, రాము, ముత్తయ్య, ప్రభాకర్, రెడ్డి మోహన్, సారయ్య తదితరులు పాల్గొన్నారు.