మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మెహిదీపట్నం ఎస్ఈ పి.వెంకన్నకి సోమవారం కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ వినతిపత్రం అందజేశారు. డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయాల్సిన విద్యుత్ స్తంభాలు, కేబుల్, ట్రాన్స్ఫార్మర్ పనులను వెంటనే ప్రారంభించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య నగర్ బస్తి అధ్యక్షుడు ఖాసీం, వార్డ్ సభ్యులు రహీం, శ్రీనివాస్ పాల్గొన్నారు.