నమస్తే శేరిలింగంపల్లి: ప్రతీ కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి గచ్చిబౌలి డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దుతామని స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంలో ప్రజా సమస్యలపై కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బస్తీ బాట చేపట్టారు. కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రజల ద్వారా అడిగి తెలుసుకున్నారు. కాలనీలో డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాల పనితీరుపై తనిఖీ చేశారు. జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి డ్రైనేజీ, సీసీ రోడ్లు, మురికి కాలువల పనుల గురించి చర్చించారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, రంగారెడ్డి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నరేందర్ ముదిరాజ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చారి, డివిజన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శంలేట్ విజయ్, గచ్చిబౌలి డివిజన్ కోశాధికారి సతీష్ గౌడ్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ దయాకర్, జీహెచ్ఎంసీ వర్క్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, సీనియర్ నాయకులు నరేందర్ యాదవ్, సంజీవ్, శ్రీనివాస్, సురేష్, నందు, శంలేట్ నరసింహ రాజు, దుర్గారామ్, వినయ్, గోపాల్, విజయ్, చిత్తారి, విష్ణు, వెంకటేష్, బ్యాగరి శ్రీకాంత్, నరేష్, నర్సింగ్ రావు, కార్తీక్, మౌసీన్, బద్రి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.