నమస్తే శేరిలింగంపల్లి: మియపూర్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూములను పరిరక్షించాలని స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ హెచ్ ఎం డీ ఏ అధికారులను విజ్ఞప్తి చేశారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్, ఎంఏ నగర్ కాలనీలలో ఉన్న ప్రభుత్వ స్థలాలను మియపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ హెచ్ ఎం డీ ఏ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా చూడాలని, ప్రభుత్వ స్థలాల చుట్టూ కంచె ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. హెచ్ఎండీఏ అధికారి శ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలో కబ్జాలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఏ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.