నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండలం మాజీ విద్యాధికారి రావు రాంచందర్రావు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని ఏఎస్ రాజు నగర్, ఈనాడు కాలనీ, రామకృష్ణ నగర్ కాలనీలలో ఆదివారం టీఆర్ఎస్ పార్టీ బస్తీ కమిటీల ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ రోజాదేవి రంగరావులు నూతన కమిటీ సభ్యులను నియమించారు. ఈ క్రమంలో శేరిలింగంపల్లి మండల విద్యాధికారిగా సేవలందించి ఇటీవల పదవీ విరమణ పొందిన రాంచందర్ రావును వారు టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనకు గులాబి కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ రాంచందర్ రావు రాకతో శేరిలింగంపల్లిలో టీఆర్ఎస్ పార్టీ బలం మరింత పెరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, డివిజన్ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, తెరాస నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు, శ్రీనివాస్ రెడ్డి, అశోక్, వెంకటేశ్వర రావు, విజయ్ కుమార్, పి స్ రాజు, నాయుడు, బ్రహ్మానందరెడ్డి, జోగి రెడ్డి, సత్యనారాయణ, పురేందర్ రెడ్డి, నర్సింగ్ రావు, నర్సింగ్ గౌడ్, మల్లయ్య, శర్మ, శ్రీనివాస్, అంజి రెడ్డి, రాజు, ఆంజనేయులు, రామచంద్ర, శ్రీధర్, రమణారెడ్డి, బాలకృష్ణ, విశ్వనాధ్, వేణుగోపాల్, సుధాకర్ రెడ్డి, రాజేష్, రవీందర్ రావు, అరుణ్ గౌడ్, నరహరి గౌడ్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.