ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి: బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: కరోనా మహమ్మారిని పూర్తి స్థాయిలో రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించాలని బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర రెడ్డి పేర్కొన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని గౌతమీనగర్ లో వంద శాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగా ఇంటింటికీ సర్వే చేస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు మాస్కులను బిజెపి రాష్ట్ర నాయకులు, గౌతమీ నగర్ కాలనీ సంక్షేమ సంఘం ప్రధాన సలహాదారుడు కసిరెడ్డి భాస్కర రెడ్డి పంపిణీ చేశారు. చందానగర్ డివిజన్ పరిధిలోని గౌతమీనగర్ మున్సిపల్ పార్కు జరిగిన ఈ కార్యక్రమంలో కసిరెడ్డి భాస్కర రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశం మేరకు వంద శాతం ఉచితంగా వ్యాక్సిన్ పూర్తి చేయడంలో భాగంగా ఇంటింటికి సర్వే చేస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ సేవలు మరవలేనివని అన్నారు. కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా రెండు డోసుల వ్యాక్సినేషన్ వేసుకున్న వారు సైతం మాస్కు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

మాస్కులు పంపిణీ చేస్తున్న బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here