గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): అయోధ్యలో రామమందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని గచ్చిబౌలి డివిజన్ బిజెపి కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని గోపన్ పల్లికి చెందిన శ్రీ రాక్ శాండ్ మిన్ బాల్స్ వారు రామ మందిర నిర్మాణం నిమిత్తం రూ.1,00,116 నిధి సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు,యువకులు పాల్గొన్నారు.