కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు

చందాన‌గ‌ర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వం లో 2020లో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని గుర్తు చేశారు. ఈ సంవత్సరం కూడా అదే స్ఫూర్తితో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారంతో డివిజన్ లో అన్ని రంగాల్లో పురోభివృద్ధిని సాధించి డివిజ‌న్‌ను ఆదర్శంగా నిలుపుతామ‌న్నారు. గత ఏడాది కరోనా మహమ్మరితో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డార‌ని, ఆ సమస్యల నుండి తేరుకొని ఈ ఏడాది ప్ర‌జల‌ కుటుంబాల్లో సుఖ, శాంతులు విలసిల్లాలని కోరుకొంటున్నాన‌ని తెలిపారు. 2020వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2021లోకి అడుగుపెడుతున్న సంద‌ర్భంగా చందానగర్ ప్రజలకు శుభం కలగాలని కోరుకుంటూ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి డివిజన్ ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ‌జేశారు.

చందాన‌గ‌ర్ డివిజ‌న్ ప్ర‌జ‌ల‌కు ఆంగ్ల నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్న కార్పొరేట‌ర్ మంజుల, ర‌ఘునాథ్ రెడ్డి దంప‌తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here