నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ శేరిలింగంపల్లి అసెంబ్లీ మహిళ మోర్చ కో-కన్వీనర్‌గా శేరిలింగంపల్లి డివిజన్‌కి చెందిన భీమని విజయలక్ష్మి నియమాకమయ్యారు. ఈ మేరకు బిజెపి రంగారెడ్డి అర్భన్ జిల్లా అధ్యక్షడు సామ రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, మహిళమోర్చ అధ్యక్షులు కృష్ణవేణి జిల్లాపార్టీ కార్యాలయంలో శనివారం విజయలక్ష్మికి నియామక పత్రం అందజేశారు. తనపై నమ్మకంతో భాధ్యతలు అప్పగించినందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి చింతికింది గోవర్ధన్ గౌడ్, మహిళ మోర్చ అధ్యక్షులు కృష్ణవేణి నాగినేని, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి గజ్జల యోగానంద్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు శెట్టిలకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలోని మహిళలను, కార్యకర్తలను ఏకం చేసుకుని పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానని అన్నారు. కేంద్ర ప్రభుత్వ మహిళ అభివృద్ది పధకాలను ప్రజల్లోకి తీసుకువెళతామని అన్నారు.