భాగ్యనగర్ ఫౌండేషన్ స్థాపన పట్ల రవికుమార్ యాదవ్ హర్షం

నమస్తే శేరిలింగంపల్లి: భాగ్యనగర్ ఫౌండేషన్ స్థాపన పట్ల బిజెపి రాష్ట్ర నాయకులు ఎం.రవికుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. కొండాపూర్ కు చెందిన బాలకుమారన్, అధ్యక్షుడిగా, పంతం నాగరాజు యాదవ్ ప్రధాన కార్యదర్శిగా, రవీందర్ యాదవ్ గంగల ఉపాధ్యక్షుడిగా, శిరీష వడ్లముడి సంయుక్త కార్యదర్శిగా, గురువయ్య పల్లె కోశాధికారిగా, శ్రీనివాస్ యాదవ్ గంగల కార్యవర్గ సభ్యుడిగా ఏర్పడిన భాగ్యనగర్ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ పత్రాలను మంగళవారం ఫౌండేషన్ ప్రతినిధులు  రవికుమార్ యాదవ్ కు అందజేశారు.

రవికుమార్ యాదవ్ కు భాగ్యనగర్ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేస్తున్న బాలకుమారన్, నాగరాజు యాదవ్

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ భాగ్యనగర్ పౌండేషన్ సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించడం, క్రీడలను ప్రోత్సహించడం, ఇతరాత్ర సమాజహిత కార్యాల్లో ముందు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుపేద చిన్నారులు, యువతలోని ప్రతిభను గుర్తించి వారికి భాగ్యనగర్ ఫౌండేషన్ అండగా నిలుస్తుందని అన్నారు. ఫౌండేషన్ కార్యకలాపాలలో తమ పూర్తి సహకారం ఉంటుందని అన్నరు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here