అయోధ్య రామ మందిర నిర్మాణానికి వాసిలి రూ.2.5 ల‌క్ష‌ల నిధి స‌మ‌ర్ప‌ణ‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: అయ్యోధ్య శ్రీ భవ్య రామమందిర నిర్మాణ జనజాగరణలో భాగంగా గురువారం బిజేపి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకిందిగోవర్ధన్ గౌడ్‌ ఆద్వ‌ర్యంలో ఆర్ఎస్ఎస్ సికింద్రాబాద్ విభాగ్ శారీరక్ ప్రముఖ్ నారాయణమూర్తి, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ నందకుమార్ యాద‌వ్‌లు గురువారం ఎన్ఎస్‌కే క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ అధినేత, టిఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు(మాజి) వాసిలి చంద్రశేఖర ప్రసాద్ ను కలిశారు. మందిర నిర్మాణ ప్రాధాన్య‌త‌, ప్రణాళిక‌ను వారికి వివ‌రించారు. స్పందించిన వాసిలి రామ‌మందిర నిర్మాణ నిధి స‌మ‌ర్ప‌ణ‌లో తనవంతుగా రూ.2.50 లక్షల చెక్కును అందజేశారు.

నందకుమార్ యాద‌వ్‌కు చెక్కును అంద‌జేస్తున్న వాసిలి చంద్ర‌శేఖ‌ర ప్ర‌సాద్‌, చిత్రంలో గోవ‌ర్ధ‌న్ గౌడ్‌, నారాయణమూర్తి

కోస‌ల రాజ్య రాజ‌దాని, స‌ర‌యూ న‌ది ఒడ్డున, అయోధ్య‌ న‌గ‌రంలోని శ్రీ రామ‌జ‌న్మ‌భూమిలో చేప‌ట్ట‌నున్న భ‌వ్య‌మందిర నిర్మాణంలో త‌న‌వంతు స‌మ‌ర్ప‌ణకు అవ‌కాశం ల‌భించ‌డం అదృష్టంగా బావిస్తున్న‌ట్టు వాసిలి చంద్ర‌శేఖ‌ర ప్ర‌సాద్ పేర్కొన్నారు. రామకార్యంలో భాగస్వామ్యులయిన వాసిలికి గోవ‌ర్ధ‌న్ గౌడ్ బృందం ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో రామ సేవ‌కులు పుట్ట విన‌య‌కుమార్ గౌడ్‌, ఎంపి రంజిత్ రెడ్డి యువ‌సేన అధ్య‌క్షులు ఆశిల శివ త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here