నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం అధ్యక్షునిగా పోతరాజు లాలయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హన్మకొండ అశోక హోటల్ లో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నరసయ్య అధ్యక్షతన అంబేద్కర్ సంఘం కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా లాలయ్య చేస్తున్న సేవలను గుర్తించి అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జరిగిందన నరసయ్య తెలిపారు. లాలయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిస్తూ వారికి అండగా ఉంటామని, అంబేద్కర్ సంఘం ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటుందని చెప్పారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని ఆయన తెలిపారు.