పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పండగలా జరపాలి – మియాపూర్ టీఆర్ఎస్ పార్టీ నాయకుల సమావేశంలో ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ‌పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రతీ కార్యకర్త ఒక పండగలా జరుపుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ టీఆర్ఎస్ నాయకులు,‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ, ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలోని రేణు గ్రాండ్ హోటల్ లో నిర్వహించిన మియాపూర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ సర్వ సభ్య సమావేశంలో స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27 న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ సమావేశాన్ని మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో నిర్వహించనున్నట్లు తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ‌ శ్రేణులంతా తమతమ బస్తీలలో, కాలనీల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని అన్నారు. పార్టీ పటిష్టతకు కృషి చేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. అనంతరం టీఆర్ఎస్ ఉద్యమకారులు పురుషోత్తం యాదవ్, లావణ్య, ఖాజా, దంగు శ్రీనివాస్ గౌడ్, బాబులను ఎమ్మెల్యే గాంధీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, పార్టీ ప్రధాన, అనుబంధ కమిటీలు, బస్తీ కమిటీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మియాపూర్ లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here