నమస్తే శేరిలింగంపల్లి: అత్మన్యూనత భావంతో తమను తాము తక్కువ చేసుకోకుండా చైతన్యవంతంగా వ్యవహరించాలని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు సూచించారు. చందానగర్ ఫ్రెండ్స్ కాలనీలో రాష్ట్ర శిష్టకరణం కులసంఘం రూపొందించిన కాలమానిని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా సామాజిక వర్గాల వెనకబాటుతనం రూపుమాపేందుకు వాస్తవికత ఆధారంగా డిమాండ్లు ఉండాలన్నారు. స్పష్టత లేని వినతులతో ప్రతిఫలం కూడా అస్పష్టంగా, నిరాశజనకంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. కాలంతో పాటు ఆధునిక అభివృద్ధిని అందుకోవడంలో వేగంగా అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ శిష్టకరణ కుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు డి.వి కృష్ణారావు తదితరులు ఉన్నారు.