నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ సర్కిల్ పరిధిలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో అధికారుల కొరతతో నెలకొంటున్న సమస్యలను పరిష్కరించాలని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మిద్దెల మల్లారెడ్డి జడ్సీకి విజ్ఞప్తి చేశారు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ప్రియాంక అలను టీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. చందానగర్ టౌన్ ప్లానింగ్ లో అధికారుల కొరతతో తీవ్ర ఇబ్బందులు తలెత్తున్నాయని వాపోయారు. చందానగర్ సర్కిల్ లో ఎన్నో అక్రమ కట్టడాలు, చెరువులు కుంటలు నాలాలు ప్రభుత్వ భూములు విపరీతంగా అక్రమ కట్టడాలు జరుగుతున్నా పర్యవేక్షణ లోపంతో పెరుగుతున్నాయని అన్నారు. ఉద్యమకారులు, పార్టీ సీనియర్ నాయకులు మిద్దెల మల్లారెడ్డి, గంగారం సంగారెడ్డి, నిమ్మల శేఖర్ గౌడ్, షేక్ జమీర్ పాల్గొన్నారు.