దశల వారీగా అభివృద్ధి పనులు చేస్తాం – చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని సమస్యలను దశల వారీగా పరిష్కరించి అభివృద్ధి పనులు చేపడుతామని కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ పనులను కాలనీ వాసులతో కలిసి స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. చందానగర్ డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. అభివృద్ధి పనుల్లో‌ జాప్యం లేకుండా నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, కాలనీ వాసులు వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్లు, ఎం విట్టల్ నాయక్, ప్రభాకర్, బాల లక్ష్మయ్య, మహేశ్వర్ రెడ్డి, కె. కృష్ణ రావు, ప్రసాద్ రాజు, జ్యోతి, లక్ష్మి, సంగీత, పద్మ, ప్రమీల, నాగరత్నం, శైలజ, మంజు, సుచిత్ర, మనోహరి, సుజాత, మాధవి, వర్క్ ఇన్‌స్పెక్టర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here