కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజలు కోరుకునే విధంగా మౌలిక వసతులు సమాకూర్చి, కొండాపూర్ డివిజన్ ను అభివృద్ధి పరచటానికి తీవ్రంగా కృషి చేస్తున్నామని కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. శనివారం మార్తాండ్ నగర్ కాలనీలో రూ.40 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ల పనులను హమీద్ పటేల్ పర్యవేక్షించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ లో సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకున్న వెంటనే త్వరిత గతిన పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతున్నదని అన్నారు. ముఖ్యంగా మౌలిక వసతులు కల్పనలో రాజీ పడకుండా పనులను చేయిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ గఫుర్, ఏరియా కమిటీ మెంబర్ మహేందర్, రజనీకాంత్, సయ్యద్ అహ్మద్, మహ్మద్ కలీం, మహ్మద్ అయూబ్, సలీం పటేల్, మస్తాన్ పటేల్, వేణు, లాయక్ పటేల్, యూత్ నాయకులు దీపక్, రఫీ, వసీమ్, ముక్తార్ పాల్గొన్నారు.