నమస్తే శేరిలింగంపల్లి: మహిళల సంరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షీ టీమ్స్ ను ఏర్పాటు చేసిందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గిగిల్ మగ్, రాధిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంయుక్తంగా 2కె, 5కె రన్‌ను మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్స్ ప్రాంగణంలో మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం రన్ లో పాల్గొన్న మహిళలకు గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా కో-ఫౌండర్ రాఘవ తో కలిసి మొక్కలను కార్పొరేటర్ మొక్కలను నాటారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. మహిళల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని చెప్పారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ తో ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని కోరారు. మహిళా దినోత్సవం పురస్కరించుకుని 5కె, 2కె రన్ ఏర్పాటు చేసిన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా నిర్వాహకులు పాల్గొన్నారు.