- శేరిలింగంపల్లి బిజెపి ఇన్చార్జి రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ లో చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా స్థానిక బిజెపి కార్యాలయంలో డివిజన్ కు సంబంధించిన బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్చార్జులు, జిల్లా ,రాష్ట్ర నాయకులు బి.జే. వై. ఎమ్ మహిళా మోర్చా నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి గెలుపునకు ప్రతి ఒక్కరూ కంకనాబద్ధులై పనిచేయాలని శేరిలింగంపల్లి బిజెపి ఇన్చార్జి రవికుమార్ యాదవ్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలలో నూటికి నూరు శాతం భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయాలని, 45 రోజులు పార్టీకి సమయాన్ని కేటాయించి ఎవరి బూత్ లో వారు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలగా పనిచేస్తే తప్పకుండా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోదరిమణి అనిత రెడ్డి, కన్వీనర్ రాఘవేంద్రరావు, అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి, శ్రీనివాస్, పృధ్వి గౌడ్, రమణయ్య , అశోక్, రవి, రాజు, జితేందర్ జిల్లా, డివిజన్ పదాధికారులు, ఓబీసీ మోర్చా, మహిళా మోర్చా, యువమోర్చా నాయకులు పాల్గొన్నారు.