శేరిలింగంపల్లి, నవంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): మదీనాగూడ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి 3వ వార్షికోత్సవ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఈ వేడుకలకు మిరియాల ప్రీతమ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు పొందారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కాలనీ వాసులు, భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలోనూ మిరియాల ప్రీతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ జనరల్ సెక్రటరీ కిట్టు, వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు, సూర్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.






