శేరిలింగంపల్లి, నవంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజల ఆరోగ్యం, సంక్షేమమే లక్ష్యంగా మియాపూర్ యువ నాయకుడు యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 9వ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ విజయవంతమైంది. యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ సహకారంతో, ఆరోబిందో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సౌజన్యంతో మియాపూర్‌లోని మొండో స్కోలరిస్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించగా, 400 మందికి పైగా ప్రజలు ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ వి. జగదీశ్వర్ గౌడ్, మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సీఈఓ విద్యా హాజరై వైద్య శిబిరాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఇలాంటి మెగా వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. యలమంచి ఉదయ్ కిరణ్ ప్రజల ఆరోగ్యం, సంక్షేమం పట్ల చూపిస్తున్న చొరవను, నిరంతరం చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులోనూ ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగించాలని ఆకాంక్షించారు. వైద్య శిబిరంలో 400 మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, నిపుణులైన వైద్యుల సంప్రదింపులు, అవసరమైన మందులు, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన సూచనలు అందించారు. అవసరమైన వారికి మమతా ఆసుపత్రి సహకారంతో ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా కల్పించారు.

గతంలో నిర్వహించిన వైద్య శిబిరాల ద్వారా పలువురు లబ్ధిదారులు మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు, కంటి ఆపరేషన్లు, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్లు తదితర వైద్య పరీక్షలు, చికిత్సలు పొందారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ అనుభవాలను పంచుకుంటూ యలమంచి ఉదయ్ కిరణ్, మమతా హాస్పిటల్ యాజమాన్యం, క్యాంపు ఇన్‌చార్జ్ ఆంజనేయులుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పాఠశాల ప్రాంగణంలో ప్రజోపయోగమైన వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు అవకాశం కల్పించిన మొండో స్కోలరిస్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ వడ్డే శివ ప్రసాద్, ప్రిన్సిపాల్ కస్తూబా, కార్యక్రమ నిర్వహణకు సహకరించిన భవన యజమాని సత్యనారాయణకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆరోబిందో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారాయణ, జనరల్ సెక్రటరీ లోకేష్, రమేష్‌తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, కాలనీవాసుల సహకారాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో అనిత, జాహ్నవి, జ్యోష్ణ, ఆలపాటి శివాజీ, మహేశ్వర్ రెడ్డి, మన్నేపల్లి సాంబశివరావు, పట్వారీ శశిధర్, రవీంద్ర రెడ్డి, గణేష్, నడిమింటి కృష్ణ, రాంచందర్ గౌడ్, రవి కుమార్, సత్యనారాయణ, లక్ష్మణ్ రావు, మోహన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, సాంబశివరావు, శేరిలింగంపల్లి నియోజకవర్గ సేవాదళ్ అధ్యక్షుడు నర్సింగ్ రావు, శ్రీనివాసు, శరత్, ప్రవీణ్, వంశీ, రత్నాచారి, సాయినిఖిల్, వినోద్, గిరి, అనిల్, కామినేని వాసు, కార్తీక్, వల్లభనేని నరసింహారావు, ప్రకాష్, సత్య, సతీష్, శేషగిరిరావు, శేఖర్, శశి, సుబ్బారావు, నరసింహారావు, శ్రీజిత్, రమేష్, గోపాల్, రాజేష్, వాసు, చాణుక్య, మహేష్, సుజాత, పద్మ, రాము, కిరణ్, వైభవ్, సత్యం, రేఖ, మధు, బాబ్జి, అంజన్ తదితర నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.





