బీఆర్ఎస్ అగ్రనేతలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన అట్టేపల్లి రామప్రభు

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బీఆర్ఎస్ పార్టీ ప్రముఖ నాయకులను అట్టేపల్లి రామప్రభు తన అనుచరగణంతో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకుని దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావులను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. వారికి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేసి ఆత్మీయంగా పలకరించారు.

ఈ కార్యక్రమంలో అట్టేపల్లి రామప్రభుతో పాటు అట్టేపల్లి పురుషోత్తం, జి. ప్రసాద్, సయ్యద్ హనీఫ్, వై. శ్రీనివాస్ గౌడ్, ఎండీ నజీర్, మోహన్, యాకన్న, దాస్ నాయక్, సాగ్గం బిక్షపతి, సనిగరపు శ్రీనివాస్, కృష్ణ, సాయి గౌడ్, ప్రదీప్, కె. శ్రీను, కె. రాజు, అరుణ్ కుమార్, సంగయ్య, చి. శ్రీరామ్, అట్టేపల్లి ప్రశాంత్, అడప అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here