యాదవుల ఆత్మగౌరవం, ఐక్యతకు ప్రతీక సదర్ సమ్మేళనం: రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 10 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): దీపావళి పండుగను పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని లింగంపల్లి విలేజ్, గంగారం, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో నిర్వహించిన సదర్ సమ్మేళన కార్యక్రమాల్లో పటాన్‌చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్‌తో కలిసి రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్, రాగం అభిషేక్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల నిర్వాహకులు, స్థానిక నాయకులు రాగం నాగేందర్ యాదవ్‌కు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.

అనంతరం రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. సదర్ సమ్మేళనం యాదవుల ఆత్మగౌరవం, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు వాటి గొప్పతనాన్ని తెలియజేయాలని, యువతకు మార్గదర్శకంగా నిలవాలని పిలుపునిచ్చారు. దీపావళి పండుగ వెలుగుల మాదిరిగా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో సీనియర్ నాయకులు మిరియాల రాఘవరావు, రామ్ మోహన్ రెడ్డి, జి. నరేందర్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, ఎస్‌ఎల్‌వీడీసీ అధ్యక్షుడు గడ్డం రవి యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, స్థానిక నాయకులు, యాదవ సంఘం పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here