శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): హిందీ దివస్ సందర్భంగా వావిలాల పాఠశాలలో HM విజయ్ కుమార్, హిందీ పండిట్ మాధవి లత విద్యార్థులకు వ్యాస రచన, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు HM విజయ్ కుమార్ బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీచరణ్ అనే విద్యార్థి తులసీదాస్ పాత్రలో, హర్ష అనే విద్యార్థి కబీర్ దాస్ పాత్రలో, రిషికా వర్మ మీరాబాయి పాత్రలో ఏకపాత్రాభినయం చేసి అలరించారు. ఈ కార్యక్రమంలో రాజారావు, వైవి శర్మ, ఋషి, రాజిరెడ్డి, జయలత, పవన్ రాజు, పెంటయ్య, టీచర్స్ పాల్గొన్నారు.






